CM రేవంత్ రెడ్డి పాశమైలారం బాధితుల పరామర్శ.. సహాయ చర్యలపై కీలక ఆదేశాలు!

CM రేవంత్ రెడ్డి పాశమైలారం బాధితుల పరామర్శ.. సహాయ చర్యలపై కీలక ఆదేశాలు!

Homeతెలంగాణ

CM రేవంత్ రెడ్డి పాశమైలారం బాధితుల పరామర్శ.. సహాయ చర్యలపై కీలక ఆదేశాలు!

సంగారెడ్డి జిల్లా, జూలై 1: పాశమైలారం బాధితుల పరామర్శ చేసిన సీఎం రేవంత్ రెడ్డి  పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో సోమవారం జరిగిన భార

పెనికో: పెరూలో కనుగొన్న 3,500 ఏళ్ల నాటి ప్రాచీన నగరం!
ఇరాన్ దాడులపై బ్రిటన్ కీలక నిర్ణయం.. స్టార్మర్ ప్రకటన
శ్రీచరణికి ఏపీ ప్రభుత్వ నజరానా – రూ.2.5 కోట్లు, ఉద్యోగం.

సంగారెడ్డి జిల్లా, జూలై 1: పాశమైలారం బాధితుల పరామర్శ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

 పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో సోమవారం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన తన ఎక్స్ ఖాతా (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందించారు.

“పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను కలిసి వారి ఆవేదనను పంచుకున్నాను. వారి బాధను పూర్తిగా అర్థం చేసుకున్నాను. బాధితుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలనే ఆదేశాలు ఇవ్వడమే కాదు, దీర్ఘకాలికంగా చేయాల్సిన చర్యలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు అధికారులకు తెలియజేశాను” అని సీఎం పేర్కొన్నారు.

అలాగే, గాయపడిన వారు ఉన్న ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, పసిబిడ్డల అవసరాలు, ఇతర అవసరాల విషయంలో ఏ లోటూ ఉండకూడదని స్పష్టంగా అధికారులకు సూచించారు.

“ఈ ఘోరమైన గాయం నుండి బాధిత కుటుంబాలు కోలుకొని మళ్లీ స్ధిరంగా జీవితం సాగించే వరకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది” అని సీఎం హామీ ఇచ్చారు.

ఇకపై ఈ విధమైన పారిశ్రామిక ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కూడా సీఎం ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube Channel.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube