అహ్మదాబాద్: ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల తాపత్రయం నేటితో ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ
అహ్మదాబాద్:
ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల తాపత్రయం నేటితో ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది.
టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించకపోయినా, అందరూ సమిష్టిగా రాణించారు. విరాట్ కోహ్లీ 43 పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పటిదార్ (26), జితేష్ శర్మ (24), మయాంక్ అగర్వాల్ (24), లివింగ్‌స్టన్ (25) తోడ్పాటు అందించడంతో ఆర్సీబీ 190 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జేమిసన్ మూడేసి వికెట్లు తీసారు.
పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్ (25) చక్కగా ఆరంభించారు. జాస్ ఇంగ్లిస్ (39) ఆడినా, తర్వాతి ఆటగాళ్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. చివరికి పంజాబ్ కింగ్స్ 184 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా ఇద్దరు చొప్పున వికెట్లు తీశారు.
ఈ విజయం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ కెరీర్‌లోని ఎప్పటికీ మరచిపోలేని మైలురాయి ఇది. RCB అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

COMMENTS