అయోధ్యలో రామ దర్బార్ ప్రతిష్ఠ వేడుకలు ప్రారంభం….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

అయోధ్యలో రామ దర్బార్ ప్రతిష్ఠ వేడుకలు ప్రారంభం…..

Homeజాతీయం

అయోధ్యలో రామ దర్బార్ ప్రతిష్ఠ వేడుకలు ప్రారంభం…..

అయోధ్య: అయోధ్య శ్రీరామ మందిరం మరో పెద్ద ఆధ్యాత్మిక ఘట్టానికి సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్స

రేపు భారత్ బంద్: బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు తెరిచే ఉంటాయా? పూర్తి వివరాలు!
“భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం”…
సమంత–రాజ్ నిడుమోరు పెళ్లి: ఈషా ఫౌండేషన్‌లో వివాహం.

అయోధ్య:
అయోధ్య శ్రీరామ మందిరం మరో పెద్ద ఆధ్యాత్మిక ఘట్టానికి సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయం మాత్రమే కాకుండా, లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, గణేశ్, సూర్య దేవుడు, భాగవతీ దేవి, అన్నపూర్ణ, శేషావతారం విగ్రహాలకు కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ఉప ఆలయాలు కూడా భక్తుల దర్శనానికి అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 8 ఉప ఆలయాలు నిర్మించగా, వాటిలోని విగ్రహాల్లోకి ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో, వేద ఘోషల నడుమ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా భక్తులు హాజరవుతుండగా, ఆలయం విద్యుత్ వెలుగులతో ముస్తాబై భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామ మందిరం చుట్టూ ఉన్న పరిసరాలన్నీ భక్తి పారవశ్యంతో నిండిపోయాయి.
ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మరో కీలక దశకు తీసుకెళ్తున్నాయి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube