గుంటూరు: టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై జరిగిన దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు ప్రభు
గుంటూరు: టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై జరిగిన దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో వైద్యపరీక్షలు నిర్వహించారు. పోలీసులు ఆయనను శనివారం ఉదయం GGHకు తీసుకెళ్లగా వైద్యులు కొన్ని పరీక్షలు చేశారు.
వైద్యపరీక్షల అనంతరం పోలీసులు నందిగం సురేష్‌ను తుళ్లూరులోని ఆంధ్రప్రదేశ్ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించగా, తదుపరి మూడు రోజుల పాటు విచారణ కొనసాగనుంది.
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం నందిగం సురేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
DP Infra Marketing instagram post

COMMENTS