హైదరాబాద్, మే 25: బోగీ మారే ప్రయత్నంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడికి చ
హైదరాబాద్, మే 25:
బోగీ మారే ప్రయత్నంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడికి చెందిన మట్టల వెంకటేష్, శ్వేత దంపతులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీ టౌన్‌షిప్, లింగంపల్లిలో నివసిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన శ్వేత (33) ఆదివారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో దిగి, తప్పుగా ఎక్కిన బోగీ నుంచి పిల్లలతో కలిసి అసలు బోగీకి మారే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే, వీరికి కేటాయించబడిన డీ-8 బోగీ బదులుగా పొరపాటున డీ-3 బోగీలోకి ఎక్కారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రాగానే ఇతర ప్రయాణికులు సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వడంతో తమ బోగీ తప్పనిది అని గ్రహించారు. వెంటనే డీ-3 నుంచి దిగిన శ్వేత, తన ఇద్దరు పిల్లలను డీ-8 బోగీలోకి ఎక్కించి తాను కూడా ఎక్కే ప్రయత్నంలో రైలు కదలడం ప్రారంభమైంది. తొందరగా ఎక్కే క్రమంలో ఆమె రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్యలో పడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ దృశ్యాన్ని చూసిన పిల్లలు గుండె పగిలేలా విలపించగా, సమాచారం అందుకున్న భర్త వెంకటేష్ ఘటనాస్థలికి చేరుకొని భార్య మృతదేహాన్ని చూసి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి, శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
DP Infra Marketing facebook post

COMMENTS