విందు నుంచి తిరుగుతూ రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

విందు నుంచి తిరుగుతూ రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి…..

Homeతెలంగాణ

విందు నుంచి తిరుగుతూ రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి…..

పెళ్లింట విషాదం… విందుకెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం… నలుగురు మృతి. పరిగి (మే 20): పెళ్లి వేడుకకు వెళ్లిన ఆనందయాత్ర విషాదయాత్రగా మారింది. షాబాద్ మండల

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం….
HYD: మానసికస్థితి సరిగ్గాలేని వ్యక్తి చూపించాడు….
సహచర ఎమ్మెల్యే మరణం మధ్య వివేక్ ఇంట్లో సంబరాలు….

పెళ్లింట విషాదం… విందుకెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం… నలుగురు మృతి.
పరిగి (మే 20): పెళ్లి వేడుకకు వెళ్లిన ఆనందయాత్ర విషాదయాత్రగా మారింది. షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు చిన్న విందుకోసం పరిగి వెళ్లి తిరిగివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగాపూర్ స్టేజీ వద్ద లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 31 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపినదే ప్రమాదానికి కారణమని సమాచారం. మృతుల్లో వధువు చిన్నమ్మ, మేనబావ, బావ, అమ్మమ్మ ఉన్నారు. గాయపడిన వారిని పరిగి, వికారాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.

wedding-Road-accident

wedding-Road-accident

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube