తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా, 20 నుంచి 40 సెం.మీ. వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వా
తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా, 20 నుంచి 40 సెం.మీ. వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లగా, చెరువులు నిండిపోవడంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. రహదారులపై వరద నీరు చేరడంతో రవాణా అంతరాయం ఏర్పడగా, పలు గ్రామాలు తాత్కాలికంగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
రాష్ట్రంలోని 621 మండలాల్లో 587 మండలాల్లో వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలాల్లో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుగ్గారం, వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలతో అనేక పంటలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుండగా, గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వరద నీటిలో కొట్టుకుపోయిన గిరిజన మహిళ మృతి చెందగా, ములుగు జిల్లా జంపన్నవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం నిలిపివేశారు. వికారాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో పలు రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సింగరేణి బొగ్గు గనులపై కూడా భారీ వర్షాల ప్రభావం పడింది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ యంత్రాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 20 నుంచి 40 సెంటీమీటర్ల వరకు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీ వర్షాలు.. జూరాల, శ్రీరాంసాగర్‌కు భారీ వరద, గోదావరి ఉప్పొంగింది
లోక్‌సభలో అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రగడ, బిల్లు ఆమోదం
నీట్ EWS కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రూ.8 లక్షల పరిమితి సమంజసమేనా?
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS