ఆపరేషన్ సిందూర్ – భారత డిఫెన్స్ శక్తి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. న్యూఢిల్లీ, మే 18 (నేషనల్ న్యూస్): పాక్ – భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భ
ఆపరేషన్ సిందూర్ – భారత డిఫెన్స్ శక్తి ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
న్యూఢిల్లీ, మే 18 (నేషనల్ న్యూస్):
పాక్ – భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. భారత డిఫెన్స్ వ్యవస్థలోని అధునాతన సాంకేతికత, గగనతల రక్షణ సామర్థ్యాన్ని ఇండియన్ ఆర్మీ తాజాగా డెమో ద్వారా ప్రజలకు పరిచయం చేసింది.
ఈ సందర్భంగా ఆకాశ్ మిస్సైల్స్, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి ఆధునిక ఆయుధాలు ఎలా పనిచేస్తాయో వివరంగా ప్రదర్శించారు. “పాకిస్థాన్ మిస్సైల్ దాడులు, డ్రోన్ల బెదిరింపుల నుంచి పంజాబ్ అమృత్సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను ఎలా రక్షించామో ఇదే విధంగా” అంటూ భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ డెమో ద్వారా భారత రక్షణ వ్యవస్థ ఎంత బలంగా, సాంకేతికంగా ముందుందో ప్రపంచానికి చూపించామని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Websoft Digital Media

COMMENTS