వడ్ల కొనుగోలు పై మంత్రి సమీక్ష – అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

వడ్ల కొనుగోలు పై మంత్రి సమీక్ష – అధికారులకు స్పష్టమైన ఆదేశాలు..

Homeతెలంగాణ

వడ్ల కొనుగోలు పై మంత్రి సమీక్ష – అధికారులకు స్పష్టమైన ఆదేశాలు..

యాసంగి ధాన్యం కొనుగోలు పై మంత్రుల సమీక్ష – రైతులకు ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలూ. హైదరాబాద్‌, మే 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాసం

సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్ వివరాలు….
ఒకే టికెట్‌తో పుష్కరాలు, ఆరు ఆలయాల దర్శనం!
ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి…..

యాసంగి ధాన్యం కొనుగోలు పై మంత్రుల సమీక్ష – రైతులకు ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలూ.
హైదరాబాద్‌, మే 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించబడింది. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో జరిగిన ఈ సమీక్షలో, వడ్ల కొనుగోలు చివరి దశలో ఉందని, రానున్న 10-15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అనుకోని వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.
ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు లభ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. రైతులకు రూ.48 గంటల్లో భూతానికీ లావాదేవీలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సన్నవడ్లకు ప్రత్యేక బోనస్ కూడా అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ సీజన్‌లో గత సీజన్‌తో పోలిస్తే నాలుగింతల ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 1.03 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించామని వెల్లడించారు.
కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు – డిఆర్డిఎ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ ప్రేం కుమార్, సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, వ్యవసాయ అధికారి విజయ నిర్మల, ఆరోగ్య అధికారి మరియన్న, రవాణా అధికారి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

websoft-clound technology

websoft-clound technology

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube