భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోత: గ్రామాలపై పాక్ షెల్లింగ్, భారత జవాన్ అమరుడు జమ్మూకశ్మీర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొన
భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోత: గ్రామాలపై పాక్ షెల్లింగ్, భారత జవాన్ అమరుడు
జమ్మూకశ్మీర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కి ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం మే 7 రాత్రి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట భారీగా కాల్పులు జరుపుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ, కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్‌కు పాల్పడుతోంది. సైనికులపై కాకుండా, సామాన్య ప్రజలు నివసించే ఇళ్లపై పాక్ కుట్రపూరితంగా కాల్పులు జరుపుతోందని భారత ఆర్మీ తెలిపింది. దీంతో సరిహద్దు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాక్ కాల్పుల్లో 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరులయ్యారు. వైట్ నైట్ కోర్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

COMMENTS