ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ….

Homeజాతీయం

ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ….

హైదరాబాద్ లో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: రహదారి ప్రాజెక్టులపై కీలక చర్చలు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదర

పాఠశాలల్లో నర్సరీ నుంచి UKG తరగతులు…..
సహచర ఎమ్మెల్యే మరణం మధ్య వివేక్ ఇంట్లో సంబరాలు….
మరోసారి నోరు జారిన సీఎం రేవంత్ రెడ్డి…..

హైదరాబాద్ లో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: రహదారి ప్రాజెక్టులపై కీలక చర్చలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక రహదారి ప్రాజెక్టులపై వీరిరువురూ చర్చించారు.
ముఖ్యంగా, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఆర్థిక, కేబినెట్ ఆమోదం తెలుపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఏకకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని సీఎం విన్నవించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR), RRR లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.  
అలాగే, ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను కూడా వీలైనంత త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వీటితో పాటు, హైదరాబాద్-డిండి- మన్ననూర్, హైదరాబాద్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, సలహాదారులు హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది.  

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube