పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన ఎంపీలతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన ఎంపీలతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన చర్చలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర అంశాలపై పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో పార్టీ వైఖరిని స్పష్టంగా వెల్లడించేలా ఎంపీలకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహకారం అవసరమైన అంశాలతో పాటు ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించే దిశగా సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ను శుక్రవారం ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు, మీడియా సంస్థల ప్రతినిధులు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.2 వేలపైగా UPI చెల్లింపులకు ఛార్జీలు? కేంద్రం కొత్త ప్రతిపాదన!
ధరణిపై సిట్ ఏర్పాటు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడి
సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS