నిమిషం చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు! - Digital Prime News

నిమిషం చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు!

Homeటెక్నాలజీ

నిమిషం చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు!

బీజింగ్‌, మే 21 – ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ప్రముఖ చైనా బ్యాటరీ తయారీ కంపెనీ ఎస్‌ఈవీబీ (SEVB) అత్యాధునిక ‘స్టార్

భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు…
భారత్‌లో బడ్జెట్‌కు అనుగుణంగా టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు….
స్వరైల్‌ సూపర్‌యాప్‌.. ఇకపై రైల్వే సేవలన్నీ ఒకే దగ్గర..

బీజింగ్‌, మే 21 – ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ప్రముఖ చైనా బ్యాటరీ తయారీ కంపెనీ ఎస్‌ఈవీబీ (SEVB) అత్యాధునిక ‘స్టార్ చేజర్ 2.0’ బ్యాటరీని ఆవిష్కరించింది. కేవలం ఒక్క నిమిషం చార్జింగ్‌తో 150 కిలోమీటర్ల రేంజ్ అందించగల ఈ బ్యాటరీ, ఈవీ టెక్నాలజీలో గేమ్‌చేంజర్‌గా అభివృద్ధి చెందుతోంది.
ఈ కొత్త బ్యాటరీని 17వ షెన్‌జెన్ అంతర్జాతీయ బ్యాటరీ ఫెయిర్‌లో ప్రదర్శించారు. దీని కీలకమైన అంశం – 12-సీ సామర్థ్యం గల అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో, 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్యాటరీలు కేవలం 5 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతాయన్న కంపెనీ ప్రకటన.
ఈవీ రంగంలో బ్యాటరీల చార్జింగ్ టైమ్‌ను పెట్రోల్ నింపే వేగానికి దగ్గర చేయాలని చాలా కంపెనీలు పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో, SEVB పరిష్కారం ప్రపంచ మార్కెట్లో పెద్ద దూకుడునకు దారి తీసే అవకాశం ఉంది.

websoft – DP Infra Marketing instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube