తెలంగాణకు ఎల్లో అలెర్ట్: నేడు, రేపు ఉరుములు, గాలులతో వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, నేడు (సోమవారం), రేపు (మంగళవారం) తె
తెలంగాణకు ఎల్లో అలెర్ట్: నేడు, రేపు ఉరుములు, గాలులతో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, నేడు (సోమవారం), రేపు (మంగళవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి మోస్తరు వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్:
సోమవారం నాడు తెలంగాణలోని మొత్తం 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించారు. ఈ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఉన్నాయి.
ఉష్ణోగ్రతలు:
రాగల మూడు రోజులలో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
నేడు (సోమవారం) అంచనా గరిష్ట ఉష్ణోగ్రతలు: ఖమ్మంలో 41.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.9 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 11 (ఆదివారం) నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు: మెదక్‌లో 41.7 డిగ్రీలు, నిజామాబాద్‌లో 41 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీలు, ఖమ్మంలో 39.4 డిగ్రీలు, నల్లగొండలో 39 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 39 డిగ్రీలు, రామగుండంలో 38.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.2 డిగ్రీలు, భద్రాచలంలో 38.2 డిగ్రీలు, హనుమకొండలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

COMMENTS