అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ట్రంప్ ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. Donald Trump కీలక నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది
అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ట్రంప్ ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Donald Trump కీలక నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అవగాహన ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ఆమోదం తెలపాల్సి ఉంది.
న్యూస్ ఏజెన్సీ AFP, AXIOS నివేదికల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు కొనసాగించడంతో పాటు అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ప్రస్తుతం ఈ ఒప్పంద ముసాయిదాపై ఇరాన్ అధికార వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
అమెరికా అధికారుల ప్రకారం.. ఒప్పందం వివరాలు ట్రంప్‌కు అందించామని, అయితే వెంటనే సంతకం చేయకుండా మరికొన్ని రోజులు ఆలోచించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ తుది నిర్ణయంపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం Strait of Hormuz జలసంధికి సంబంధించినది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాలని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ తాత్కాలికంగా టోల్ వసూళ్లు నిలిపివేసే అవకాశం ఉందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా పలు షరతులు ప్రతిపాదించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉండాలని, యురేనియం శుద్ధిపై ఇరు దేశాలు చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. ప్రతిఫలంగా అమెరికా కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ బుధవారం ఇరాన్‌కు చెందిన డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు ప్రకటించింది. అలాగే బందర్ అబ్బాస్ సమీపంలోని ఇరాన్ నియంత్రణ కేంద్రంపై అమెరికా దాడులు జరిపినట్లు సమాచారం.
ఈ ఒప్పందంపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకుంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS