ఇరాన్‌పై భారీ సైనిక దాడిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చర్చలకు అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అమె
ఇరాన్‌పై భారీ సైనిక దాడిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చర్చలకు అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక దాడి చేపట్టే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం అమెరికాతో చర్చల విషయంలో తీవ్రంగా ఆలోచిస్తోందని తెలిపారు.
వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌కు ప్రస్తుతం రెండు మార్గాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి అమెరికాతో శాంతి ఒప్పందానికి అంగీకరించడం, లేదంటే గతంలో కంటే మరింత తీవ్ర సైనిక చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి భద్రత అత్యంత కీలకమని పేర్కొన్న ట్రంప్.. అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం కలగకుండా ఉండేందుకే గత రెండు వారాలుగా అమెరికా దాడులు కొనసాగించిందన్నారు. ఈ ఉద్రిక్తతల సమయంలో జరిగిన ప్రతిదాడుల్లో నలుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇస్తున్నామని ట్రంప్ తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ దశకు చేరుకోవడం అమెరికా సహనానికి “రెడ్ లైన్” అవుతుందని ఆయన హెచ్చరించారు.
ఇరాన్‌కు చైనా, రష్యా ఆయుధాలు లేదా నిఘా సహాయం అందిస్తున్నాయనే వార్తలను కూడా ట్రంప్ ఖండించారు. చైనా, రష్యా అధ్యక్షులు ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని తనకు హామీ ఇచ్చారని, వారి మాటపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం దౌత్య చర్చలకు అవకాశం ఉండటంతో తక్షణ భారీ సైనిక చర్యలు చేపట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజమౌళి ‘వారణాసి’కి గ్రీన్ సిగ్నల్.. ఒక్క రూపాయి తీసుకోకుండా టైటిల్ ఇచ్చిన దర్శకుడు!
చెన్నై లవ్‌స్టోరీ మూవీ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో మెప్పించాడా?
ప్రజాదర్బార్‌లో ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్.. వినతులు స్వీకరణ
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS