అమెరికా USCIS వర్క్ పర్మిట్ గడువును 5 ఏళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. శరణార్థులు, ఆశ్రయం కోరేవారికి ప్రభావం చూపే ఈ నిబంధనలు డిసెంబర్ 5 నుంచి అమల్లోక
అమెరికా USCIS వర్క్ పర్మిట్ గడువును 5 ఏళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. శరణార్థులు, ఆశ్రయం కోరేవారికి ప్రభావం చూపే ఈ నిబంధనలు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి.
USCIS cuts work permit: అమెరికాలో విదేశీ ఉద్యోగులకు కొత్త ఇబ్బందులు తలెత్తనున్నాయి. ముఖ్యంగా శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వలసదారులకు భారీ షాక్ ఇచ్చేలా ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పటి వరకు ఐదేళ్లపాటు చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ గడువును కేవలం 18 నెలలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మార్పులు డిసెంబర్ 5 నుండి అమల్లోకి వస్తాయని ఏజెన్సీ స్పష్టం చేసింది.
అమెరికాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS పేర్కొంది. వాషింగ్టన్ డీసీలో గతేడాది జరిగిన నేషనల్ గార్డ్ సభ్యులపై దాడిని ఉదహరిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తరచుగా భద్రతా సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తెలిపారు. దాడి చేసిన ఆఫ్ఘన్ జాతీయుడు రహమనుల్లా లకన్వాల్కు ఇటీవలే ఆశ్రయం లభించడం ఈ మార్పులకు కీలక కారణంగా సూచించారు.
కొత్త నిబంధనల ప్రకారం శరణార్థులు, ఆశ్రయం పొందినవారు, గ్రీన్ కార్డ్ పెండింగ్ దరఖాస్తుదారులు అందుకునే వర్క్ పర్మిట్ గరిష్ట కాల పరిమితి 18 నెలలకు తగ్గించబడుతోంది. అలాగే టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) హోల్డర్లు, TPS పెండింగ్ దరఖాస్తుదారుల వర్క్ పర్మిట్లు వారి అధికారిక బసపై ఆధారపడి ఒక్క సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి పరిమితం అవుతాయి. ఈ మార్పులు డిసెంబర్ 5 లేదా ఆ తర్వాత దాఖలు చేసే ఫార్మ్ I-765 దరఖాస్తులన్నింటికీ వర్తిస్తాయి.
కానీ ఈ తరచూ పర్మిట్ రిన్యూవల్ బాధ్యత వలస వ్యవస్థపై ఇప్పటికే ఉన్న భారీ బ్యాక్‌లాగ్‌ను మరింత పెంచే ప్రమాదం ఉందని వలస న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రజల భద్రత కోసం తీసుకున్న అవసరమైన చర్యగా సమర్థించుకుంటోంది. అయితే విమర్శకులు మాత్రం ఆశ్రయం కోసం అమెరికాకు రానేకి వచ్చే వలసదారులను నిరుత్సాహపర్చేందుకే ఈ మార్పులు చేయడం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు వలసదారుల జీవితాలు, ఉద్యోగ భద్రతపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆందోళన కూడా పెరుగుతోంది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS