యుద్ధం వదంతులు: UGC పరీక్షలు రద్దు చేయలేదు - స్పష్టం చేసిన కమిషన్ ముఖ్య గమనిక: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిట
యుద్ధం వదంతులు: UGC పరీక్షలు రద్దు చేయలేదు – స్పష్టం చేసిన కమిషన్
ముఖ్య గమనిక: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అన్ని పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను ఇళ్లకు పంపించివేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా తప్పు.
ఈ వదంతులపై స్పందించిన UGC, తాము అలాంటి ఎలాంటి ప్రకటన చేయలేదని, వైరల్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సూచించింది. పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు.
అధికారిక సమాచారం కోసం UGC వెబ్‌సైట్ లేదా విశ్వవిద్యాలయాల అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరడమైనది.
COMMENTS