నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు వివాదం: మహిళ హల్చల్…. - Digital Prime News

నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు వివాదం: మహిళ హల్చల్….

Homeతెలంగాణ

నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు వివాదం: మహిళ హల్చల్….

నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు రచ్చ: రూల్ ఏంటంటూ మహిళ నిరసన! నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద ఆర్టీసీ బస్సులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కల్లు బాటిళ్లతో బ

శాంతిచర్చలు జరపాలని ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ……
తాత్కాలికంగా 27 ఎయిర్‌పోర్టులు మూసివేత…
త్రివిధ దళాల నిర్ణయాలతో గర్విస్తున్నా: రోహిత్… 

నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు రచ్చ: రూల్ ఏంటంటూ మహిళ నిరసన!
నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద ఆర్టీసీ బస్సులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కల్లు బాటిళ్లతో బస్సెక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళను బస్సు సిబ్బంది (కండక్టర్, డ్రైవర్) అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కల్లు వంటివి తీసుకెళ్లకూడదని చెప్పడంతో సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.
‘ఆర్టీసీ బస్సుల్లో కల్లు తీసుకెళ్లకూడదని ఏ రూల్ ఉందో చూపించండి’ అంటూ డ్రైవర్, కండక్టర్లతో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా, బస్సు ఎదుట నిలబడి బస్సు ముందుకు కదలకుండా కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసింది.
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాసేపు హైడ్రామా నడిచాక, ఆ మహిళ చివరకు ఆటోలో తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం బస్సుల్లో కల్లును తీసుకెళ్లడానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube