ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని తిరంగా ర్యాలీ – ప్రజలంతా పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు హైదరాబాద్, మే 16: భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆప
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని తిరంగా ర్యాలీ – ప్రజలంతా పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, మే 16: భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పురస్కరంగా నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ర్యాలీ జాతీయ గౌరవాన్ని, సైనిక సాహసాన్ని గుర్తు చేసేలా నిర్వహించబడుతున్నదని ఆయన అన్నారు. భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సింధూర్ దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలోని యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీ దేశభక్తిని పెంపొందించడంలో ఓ మైలురాయి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
COMMENTS