ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దును అధికారికంగా ప్రకటించారు. పుకార్లపై లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. S
ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దును అధికారికంగా ప్రకటించారు. పుకార్లపై లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Smriti Mandhana, Palash Muchhal, Wedding Cancelled: ఇండియన్ వుమెన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 7 (ఆదివారం) ఈ ఇద్దరూ వేర్వేరుగా తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా వివాహం రద్దయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒకప్పుడు సెలబ్రిటీ వెడ్డింగ్‌గా భావించిన ఈ వివాహం ఇలా రద్దు కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నిజానికి నవంబర్ 23న స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వేడుకల కోసం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. కానీ పెళ్లి రోజు ఉదయం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడం, అదే సమయంలో పలాష్ ముచ్చల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో వివాహాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో చివరకు పెళ్లినే రద్దు చేస్తున్నట్లు ఇరు వర్గాలు ప్రకటించాయి.
వివాహం రద్దుపై పలాష్ ముచ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా జీవితంలో ముందుకు సాగాలని, వ్యక్తిగత సంబంధాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా గురించి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చెందడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన సమయం’’ అని పేర్కొన్నాడు. అలాగే తప్పుడు వార్తలు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన వార్నింగ్ కూడా ఇచ్చాడు.

Smriti Mandhana and Palash Muchhal announce wedding cancellation via Instagram.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ వివాహం రద్దుకు సంబంధించి పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సంగీత్ వేడుక రోజు స్మృతి మంధానపై పలాష్ ముచ్చల్ చీటింగ్ చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఇరు వర్గాలు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
ఈ వ్యవహారంపై స్మృతి మంధాన కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది. ‘‘గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక కథనాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. మా పెళ్లి రద్దయిన విషయం నిజమే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించండి. కుటుంబాల గోప్యతను గౌరవించి మాకు కొంత సమయం ఇవ్వండి’’ అని కోరింది.

Smriti Mandhana and Palash Muchhal announce wedding cancellation via Instagram.
తన జీవిత లక్ష్యం భారత్‌కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమేనని, దేశం కోసం ఎక్కువకాలం క్రికెట్ ఆడి ట్రోఫీలు గెలవడంపైనే తన పూర్తి దృష్టి ఉంటుందని స్మృతి మంధాన స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS