Revanth Reddy Warns MLAs Over SIR Monitoring Lapses

SIRపై రేవంత్ ఫైర్.. ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్

Homeతెలంగాణ

SIRపై రేవంత్ ఫైర్.. ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్

SIR అంశంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు తెలం

కొండా సురేఖపై ఒత్తిడి.. రాజీనామా చేయించే దిశగా కాంగ్రెస్‌లో మంతనాలు?
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి.. సీఎం రేవంత్ సహా పలువురు నేతల తీవ్ర సంతాపం
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం.. క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ!

SIR అంశంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు

తెలంగాణలో SIR ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తుండగా, ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. SIR అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, ప్రతి ఓటును కాపాడేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో మాట్లాడుతూ SIR ప్రక్రియలో బీజేపీ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం, అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్ర రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యత ఇస్తే వెళ్లి పని చేస్తానని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడని నాయకులు అవసరం లేదని స్పష్టం చేస్తూ, వారం రోజుల్లో పనితీరు మెరుగుపరచుకోకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్ నాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమిస్తామని హెచ్చరించారు.

ఇన్‌ఛార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. పనిచేయని మంత్రులను కూడా మార్చేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎవరు పని చేయడం లేదో తన వద్ద పూర్తి నివేదిక ఉందని, తదుపరి సమావేశంలో పేర్లు ప్రకటించే పరిస్థితి తీసుకురావొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పలువురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి, నిజామాబాద్ ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉందని, అక్కడ ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పారు. ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని గుర్తుచేశారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడి సామాజిక గుర్తింపని, దాన్ని రక్షించడం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి…

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఊపు.. భూసేకరణ ప్రారంభం

రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం.. కేసీఆర్‌కే ప్రజల మద్దతు: కేటీఆర్

మమతకు షాక్.. టీఎంసీ చీఫ్ పదవి నుంచి తొలగింపు, కొత్త కమిటీ ప్రకటన

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews 

 

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube