టీఎంసీలో తిరుగుబాటు మరింత ముదిరింది. మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు.
టీఎంసీలో తిరుగుబాటు మరింత ముదిరింది. మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపే పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రెబల్ వర్గం బహిరంగంగా తిరుగుబాటు ప్రకటించింది. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మమతా బెనర్జీని పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లు రెబల్ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అరుప్ రాయ్‌ను కొత్త చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు వెల్లడించింది.
1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గం తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మమతా మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని కూడా ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
న్యూటౌన్‌లోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో పార్టీ రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని రితబ్రత బెనర్జీ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు కాలేదని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడేందుకే సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
సమావేశంలో అరుప్ రాయ్ అధ్యక్షతన కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. ప్రారంభంలో పది మందితో కమిటీ ఏర్పాటు చేసి, అనంతరం సభ్యుల సంఖ్యను 30కి పెంచారు. అరుప్ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను వైస్ చైర్‌పర్సన్‌లుగా, రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సాందీపన్‌లను ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.
ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే రెబల్ వర్గం ప్రకటించిన ఈ నిర్ణయాలకు అధికారిక టీఎంసీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సంక్షోభం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి…
కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్.. అరెస్ట్ భయం?
డీఎస్సీ అస్త్రంతో అసెంబ్లీలోకి జగన్? వైసీపీ కొత్త వ్యూహంపై చర్చ
టెలిగ్రామ్ బ్యాన్‌పై కోర్టు షాక్ తీర్పు.. కేంద్రానికి ఊరట
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS