కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడి ఆరోపణలు – భక్తుల ఆవేదన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ఘాటు
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడి ఆరోపణలు – భక్తుల ఆవేదన.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ఘాటులో ఏర్పాట్లు పేరుతో ప్రజలపై ప్రభుత్వ దోపిడీ జరుగుతోందని భక్తులు, సన్యాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. కారు పార్కింగ్‌కు రూ.100, స్వామివారి దర్శనానికి మరో రూ.100 వసూలు చేస్తుండటం పట్ల విశ్వాసితులలో ఆగ్రహం చెలరేగుతోంది.
“సన్యాసులము మేము.. వదలండి” అని చెప్పినా కూడా అధికారులు వదలకుండా వసూలు చేయడంపై సన్యాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై సన్యాసులు “బిజినెస్ చేస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం పుష్కరాల కోసం రూ.33 కోట్లు కేటాయించిందని చెబుతున్నప్పటికీ, ఘాటులో మట్టి రోడ్డు, రెండు టెంట్లు తప్ప ఎలాంటి వసతులు కనిపించడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

COMMENTS