రాజేశ్ లాకప్ డెత్ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ పోలీసు, జిల్లా అధికారులను ఆదేశించింది. తెలం
రాజేశ్ లాకప్ డెత్ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ పోలీసు, జిల్లా అధికారులను ఆదేశించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను ఆదేశించింది. బాధితుడు రాజేశ్‌ను కోదాడ పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేశారంటూ న్యాయవాది రామారావు ఇమ్మినేని చేసిన ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన కమిషన్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు రాజేశ్ మరణాన్ని కస్టడీ హత్యగా గుర్తించాలని, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, దర్యాప్తు వివరాలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ముఖ్యంగా పోస్ట్‌మార్టం వీడియో, పోస్ట్‌మార్టం నివేదిక, మేజిస్ట్రియల్ విచారణ పత్రాలు, వైద్య నివేదికలు, దర్యాప్తు రికార్డులు తదితర అంశాలను కమిషన్‌కు అందజేయాలని సూచించింది.
అదేవిధంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ, రాజేశ్ మరణానికి దారితీసిన పరిస్థితులు, పోలీసుల పాత్ర, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరింది. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించిందా? ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను కూడా సమర్పించాలని సూచించింది.
ఇక రాజేశ్‌పై ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కస్టడీలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, మరణానికి గల అసలు కారణాలపై వివాదం కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకోగా, రాబోయే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి…
రాజాసింగ్‌కు భారీ ఊరట.. 2022 వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నిర్దోషి
నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి.. సీనియర్ IPS భార్య సంచలన విజ్ఞప్తి
టీఎంసీకి కోల్‌కతా హైకోర్టులో షాక్.. బ్యాంక్ ఖాతాల కేసులో అత్యవసర విచారణకు నో
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS