మంత్రి అజారుద్దీన్‌కు పదవి గండమా? రేవంత్ వ్యూహం ఏంటి?

మంత్రి అజారుద్దీన్‌కు పదవి గండమా? రేవంత్ వ్యూహం ఏంటి?

Homeతెలంగాణ

మంత్రి అజారుద్దీన్‌కు పదవి గండమా? రేవంత్ వ్యూహం ఏంటి?

ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన అజారుద్దీన్‌కు నాలుగు నెలల గడువు. ఎమ్మెల్సీ సమస్య, సుప్రీంకోర్టు తీర్పుతో మంత్రి పదవి కొనసాగుతుందా? Minister Mohammed

పవన్ వ్యాఖ్యలపై ఆలస్య రియాక్షన్‌ వెనుక రాజకీయమేం?
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. సీఎం రేవంత్ తీరుపై మంత్రుల భేటీ
పవన్ కళ్యాణ్ ఫోటో పిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్

ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన అజారుద్దీన్‌కు నాలుగు నెలల గడువు. ఎమ్మెల్సీ సమస్య, సుప్రీంకోర్టు తీర్పుతో మంత్రి పదవి కొనసాగుతుందా?

Minister Mohammed Azharuddin: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండానే ఆయనకు కేబినెట్ మంత్రి పదవి దక్కడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీ కోటాలో కాంగ్రెస్ హైకమాండ్‌తో ఉన్న పరిచయాల ద్వారా అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించింది. అయితే ఇప్పుడు అదే పదవి ఆయనకు డైలమాగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి అయితే, ఆరు నెలల్లోపు ఏదైనా ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రి పదవి స్వీకరించి ఇప్పటికే రెండు నెలలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ కానుందన్న సమాచారం ఆయన అవకాశాలను మరింత క్లిష్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేయగా, అప్పటి గవర్నర్ వాటిని ఆమోదించలేదు. ఈ అంశం కోర్టుకు వెళ్లి, చివరకు ఆ నియామకాలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అనంతరం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మరోసారి నామినేషన్ పంపినా, దీనిపై ఇంకా కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు అజారుద్దీన్‌కు అనుకూలంగా వస్తే ఆయన మంత్రి పదవి కొనసాగుతుంది. లేకపోతే పదవి కోల్పోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరో ప్రత్యామ్నాయంగా, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఎవరైనా రాజీనామా చేసి అజారుద్దీన్‌కు అవకాశం కల్పించాలన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ లోపల ఇది సాధ్యమా అనే సందేహాలు ఉన్నాయి.

ఇక మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశముందన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అలా జరిగితే అజారుద్దీన్‌ను ఆ బరిలో దింపే వ్యూహం ఉందన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube