పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో పోలీసులు నిఘా పెంచి చెక్ పోస్టులు, సర్వేలెన్స్ టీంలతో నగదు–మద్యం రవాణాను అడ్డుకుంటున్నారు. పంచాయతీ ఎన్న
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో పోలీసులు నిఘా పెంచి చెక్ పోస్టులు, సర్వేలెన్స్ టీంలతో నగదు–మద్యం రవాణాను అడ్డుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఎవరైనా ఉల్లంఘనలు జరిపితే వెంటనే చర్యలు తీసుకునేలా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సరిహద్దుల వద్ద నగదు, మద్యం మరియు అనుమానాస్పద వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఇంటర్ స్టేట్ చెక్ పోస్టును ఏర్పాటు చేసి తెలంగాణ–మహారాష్ట్ర వైపునకు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇదేవిధంగా పెద్దపల్లి జిల్లా వైపు నుంచి భూపాలపల్లి జిల్లాకు వచ్చే రాకపోకలపై మల్హర్ మండల సరిహద్దులో ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. హనుమకొండ, భూపాలపల్లి సరిహద్దు ప్రాంతమైన రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి పరిధిలో కూడా పోలీసులు నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి, గణపురం మండలాల్లో, రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల్లో, మూడో విడతలో కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడతకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మొత్తం జిల్లాలో 312 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా గత ఎన్నికల్లో వివాదాస్పద ఘటనల్లో పాల్గొన్న రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు పంపిణీ, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలు నిఘా ఏర్పాటు చేశాయి. ప్రతి మండలానికి ముగ్గురు అధికారులతో కూడిన బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రొచ్చగొట్టే పోస్టులు, వ్యక్తులను అవమానించే కంటెంట్ ప్రచురిస్తే పోలీస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల కోడ్ సమయంలో రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే రసీదులు, సరైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు స్పష్టంచేశారు. లేకపోతే నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సెన్సిటివ్, క్రిటికల్‌గా విభజించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి విడత ఎన్నికల కోసం 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పటిష్ట నిఘా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS