Khajaguda Junction Traffic Diversions for 60 Days

ఖాజాగూడ జంక్షన్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. 60 రోజుల ఆంక్షలు

Homeతెలంగాణ

ఖాజాగూడ జంక్షన్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. 60 రోజుల ఆంక్షలు

ఖాజాగూడ జంక్షన్ వద్ద నీటి పైపులైన్ పనుల కారణంగా సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే. హై

రూ.792 కోట్ల స్కామ్.. ఈడీ చరిత్రలో తొలి ప్రైవేట్ జెట్ వేలం
సీఎం రేవంత్ అమెరికా టూర్‌కు బ్రేక్? కేంద్రం క్లియరెన్స్‌పై ఉత్కంఠ
ఏసీబీ దాడుల్లో భారీ నగదు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో అక్రమాస్తుల వెలుగు

ఖాజాగూడ జంక్షన్ వద్ద నీటి పైపులైన్ పనుల కారణంగా సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఖాజాగూడ జంక్షన్‌ వద్ద నీటి పైపులైన్‌ పనుల కారణంగా తాత్కాలిక ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పనులు సజావుగా కొనసాగేందుకు సెప్టెంబర్‌ 26 నుంచి 60 రోజుల పాటు కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ఖాజాగూడ జంక్షన్‌ వద్ద కిమ్స్‌ ఆస్పత్రి వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డు వైపు వెళ్లే సర్వీస్‌ రోడ్‌, ఫ్రీ లెఫ్ట్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అలాగే బయోడైవర్సిటీ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు రైట్‌ టర్న్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

షేక్‌పేట ఫ్లైఓవర్‌ నుంచి ఖాజాగూడ వైపు వచ్చే వాహనాలు కిమ్స్‌ ఆస్పత్రికి ముందు ఉన్న టింబర్‌లేక్‌ కాలనీ రోడ్డు ద్వారా మళ్లించి నానక్‌రామ్‌గూడ రోడ్డుకు చేరుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

అదేవిధంగా గచ్చిబౌలి, బయోడైవర్సిటీ లెవల్‌-1 ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను పక్వాన్‌ యూటర్న్‌ వద్ద మళ్లించనున్నారు. అక్కడి నుంచి ఖాజాగూడ లేక్‌ రోడ్‌ మీదుగా ఖాజాగూడ వైపు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

ఐటీ ఉద్యోగులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి

ఖాజాగూడ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో ఐటీ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉండటంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణ ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే ఎంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

నీటి పైపులైన్‌ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలని, ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ రూట్లను వినియోగించాలని అధికారులు కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సాహితీ ఇన్‌ఫ్రా కేసు.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

బ్యాంకులకు 5 రోజుల బ్రేక్? 28–30 తేదీల్లో ఉద్యోగుల సమ్మె

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Instagram: DigitalPrimeNews
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube