జగిత్యాల: కుమార్తె లవ్ మ్యారేజ్.. గర్భిణీ అని చూడకుండా కిడ్నాప్‌కు యత్నించిన తల్లిదండ్రులు! జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రేమ పెళ్లి
జగిత్యాల: కుమార్తె లవ్ మ్యారేజ్.. గర్భిణీ అని చూడకుండా కిడ్నాప్‌కు యత్నించిన తల్లిదండ్రులు!
జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. కుమార్తె గర్భం దాల్చిన విషయం తెలిసిన తల్లిదండ్రులు, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే నెపంతో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్రమత్తమైన కుమార్తె వారిని తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రుల నుంచే ప్రాణ హాని ఉందని పోలీసులకు తెలిపింది.
తమ్మిశెట్టి ప్రియాంక అనే యువతి, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌కు చెందినది. ఆమె, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌తో గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాంతర వివాహం కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినా ఇద్దరూ జూలై 27న గుడిలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ప్రియాంక తల్లి ఫోన్‌లో మాట్లాడి “మంచిగా బతకండి బిడ్డా” అంటూ ప్రేమగా ప్రవర్తించిందని ప్రియాంక తెలిపింది. కానీ ఇది కేవలం కుట్ర అని ఆమె చెబుతోంది. గర్భం దాల్చిన తర్వాత ఆస్పత్రికి తనతో వస్తానని చెప్పిన తల్లి, అక్కడే తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది.
డాక్టర్‌ను కలిసి తిరిగి వస్తుండగా తల్లి, అత్త వాష్‌రూమ్‌కి వెళ్తామంటూ తీసుకెళ్లారు. అదే సమయంలో తండ్రి, అక్క భర్త కలిసి కారులో వచ్చి తనను బలవంతంగా ఎక్కించుకునేందుకు ప్రయత్నించారని ప్రియాంక తెలిపింది. అయితే, స్థానికుల సహాయంతో తప్పించుకొని 100కు కాల్ చేసి పోలీసులను ఆశ్రయించింది.
తనను కిడ్నాప్ చేయడమే కాకుండా చంపుతామని బెదిరించారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, బావ మరియు కుటుంబ సభ్యులు తన భర్తకు ప్రాణ హాని కలిగించే అవకాశం ఉందని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!
#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS