హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టం స్థానంలో కోర్ అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా “కోర్ అర్బన్ చట్టం” తీసుకురావాలని సూచిస్తూ, అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులు మరియు పరిపాలనా వ్యవహారాలన్నీ ఆ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా మున్సిపల్ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధి వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
కోర్ అర్బన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పెంచి నిర్దేశిత కాలం వరకు నిలిచేలా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా కోర్ అర్బన్ ప్రాంతాల్లో వీధి దీపాల పనితీరును డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించే విధానం అమలు చేయాలని తెలిపారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించే వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. నగరంలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, తరచూ తనిఖీలు నిర్వహించి ఆహార భద్రతపై హోటళ్లు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ నిర్ణయాలు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS