జగన్ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు–పవన్–లోకేష్‌లపై ఘాటు విమర్శలు

జగన్ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు–పవన్–లోకేష్‌లపై ఘాటు విమర్శలు

Homeఆంధ్రప్రదేశ్

జగన్ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు–పవన్–లోకేష్‌లపై ఘాటు విమర్శలు

కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై చీటింగ్ కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. YS Jagan accuse

రఘురామ టార్చర్ కేసు: ఐపీఎస్ అధికారిపై వివాదం
ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి….
చంద్రబాబుకు పొన్నం లేఖ.. తెలంగాణపై వివాదం

కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై చీటింగ్ కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan accuses Chandrababu, Pawan Kalyan and Lokesh of cheating: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నిక‌ల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను చీటింగ్ కేసులపై బొక్కలో వేయాల్సిన పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధపు ప్రచారమని, ప్రజలను తప్పుదారి పట్టించడానికి కొత్త కొత్త స్కీంల పేర్లతో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

‘‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చేసేశాం’’ అని చంద్రబాబు మాట్లాడటం పూర్తిగా అబద్ధం అని జగన్ అన్నారు. హిట్లర్ కాలంలో ఉండే కమ్యూనికేషన్ మినిస్టర్ గోబెల్స్‌తో చంద్రబాబును పోల్చుతూ, ఆయన గోబెల్స్‌కు కూడా మెంటార్‌గా నిలిచే స్థాయిలో అబద్ధాలను రాసిపెడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను గుర్తుచేస్తూ, వాటిలో ఒక్కటీ అమలు కాలేదని జగన్ ధ్వజమెత్తారు.

ఆడబిడ్డ 18ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి సంవత్సరానికి రూ.18,000 ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్న హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. అమ్మఒడి స్కీంను ‘తల్లికి వందనం’గా మార్చి, మొదటి సంవత్సరం మొత్తం నిధులను ఎగ్గొట్టి, రెండో సంవత్సరంలో 20 లక్షల మంది పిల్లలను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని అన్నారు.

అన్నదాత సుఖీభవ–పీఎం-కిసాన్ కింద సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని చెప్పి, రెండు సంవత్సరాలకు కలిపి ఇవ్వాల్సిన రూ.40,000 నుంచి కేవలం రూ.10,000 మాత్రమే ఇచ్చారని జగన్ వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణం అన్న హామీ కూడా వాస్తవంలో పరిమిత బస్సులకు, కొద్దిమందికి మాత్రమే వర్తిస్తోందని అన్నారు.

“ఇన్ని 420 చేష్టలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదే వేరేవాడు ఫైనాన్స్ స్కీం లేదా చిట్‌ఫండ్ పేరుతో చేసినా జైల్లో పెడతారు. మరి వీళ్ల ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయకూడదా?” అంటూ జగన్ ఘాటుగా ప్రశ్నించారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube