HYD: ఈ నెల 31న మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYD: ఈ నెల 31న మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలు….

Homeతెలంగాణ

HYD: ఈ నెల 31న మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలు….

అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం భాగ్యనగరం హైదరాబాద్ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఎంట్రీ ఫ్రీ! 
ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి…..
మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా?

అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం
భాగ్యనగరం హైదరాబాద్ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మే 8వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు నగరంలో వివిధ రకాల కార్యక్రమాలు, వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి విచ్చేసిన అందాల సుందరీమణులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చార్మినార్, వరంగల్ కోట, యాదాద్రి ఆలయం, రామప్ప ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. అంతేకాకుండా, టీహబ్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఐపీఎల్ మ్యాచ్ వంటి ఆధునిక, వినోదాత్మక కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ముఖ్యంగా, మే 31న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపును తీసుకురానుంది. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలను వేగవంతం చేస్తోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube