హైదరాబాద్‌లో ఫోక్ సింగర్ బర్త్‌డే పార్టీ హంగామా – డ్రగ్స్ టెస్ట్‌ల్లో గంజాయి పాజిటివ్. హైదరాబాద్ నగర శివారులో ఓ ప్రముఖ ఫోక్ సింగర్ బర్త్‌డే పార్టీ ప
హైదరాబాద్‌లో ఫోక్ సింగర్ బర్త్‌డే పార్టీ హంగామా – డ్రగ్స్ టెస్ట్‌ల్లో గంజాయి పాజిటివ్.
హైదరాబాద్ నగర శివారులో ఓ ప్రముఖ ఫోక్ సింగర్ బర్త్‌డే పార్టీ పెద్ద వివాదంగా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని త్రిపుర రిసార్ట్‌లో జరగిన ఈ పార్టీపై పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి.
ఈ వేడుకలో పలువురు యువతులు, యువకులు పాల్గొనగా, పార్టీ పేరుతో విదేశీ మద్యం, నిషేధిత పదార్థాలు వినియోగించారని పోలీసులకు సమాచారమవడంతో, అర్ధరాత్రి రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యం సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్ టెస్టులు – గంజాయి పాజిటివ్:
రిసార్ట్‌లో ఉన్నవారిలో చాలామందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, కొందరిలో గంజాయి (Cannabis) పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. వారి శరీర నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. పార్టీకి హాజరైన ప్రముఖులు కూడా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు.
పోలీసుల చర్యలు:
చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు.
ఫోక్ సింగర్‌తో పాటు నిర్వాహకులపై మాదకద్రవ్య నిషేధ చట్టం కింద అభియోగాలు.
మిగతా హాజరైన వారిపై విచారణ కొనసాగుతోంది.
CCTV ఫుటేజ్, వీడియో క్లిప్‌లు సేకరించి నిఖార్సయిన ఆధారాలు వెలికితీసే పనిలో ఉన్న పోలీసులు.
ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫోక్ సింగర్ పేరును పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, పలువురు ప్రజాప్రతినిధులు, కళాకారులు బర్త్‌డే పార్టీకి హాజరైనట్లు ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

COMMENTS