బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ముచ్చట్లు – హారర్, మిస్టరీకి కొత్త ఎక్స్‌పీరియన్స్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే సినిమా ‘కిష్కి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ముచ్చట్లు – హారర్, మిస్టరీకి కొత్త ఎక్స్‌పీరియన్స్
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే సినిమా ‘కిష్కిందపురి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హారర్ సినిమాల్లో ఇంత కథ ఉన్న సినిమా తాను చూడలేదని, ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
ఈ చిత్రం కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా అన్నారు:
“నేను ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలు చేసినా, నాకు హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. దర్శకుడు కౌశిక్ కలిసినప్పుడు ‘కిష్కిందపురి’ కథ విన్నాను. చాలా నచ్చింది. కొత్త అనుభూతి ఇవ్వగలదని భావించాను. ఈ సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది. హారర్ జానర్‌లో ఇంత స్ట్రాంగ్ కథతో కూడిన సినిమా నేను చూడలేదు.”
ఈ సినిమాలో హారర్, మిస్టరీ, యాక్షన్, కామెడీ అన్నీ మిళితమై ఉంటాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా సువర్ణమాయ వింటేజ్ రేడియో స్టేషన్ సెట్, రియల్ హాంటెడ్ హౌస్‌లో చేసిన షూటింగ్ ప్రత్యేకతగా నిలుస్తాయని చెప్పారు.
అనుపమ పరమేశ్వరన్ నటన కొత్తగా కనిపిస్తుందని, అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నికల్‌గా, విజువల్స్, సౌండ్ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ చేయలేదని, ప్రేక్షకులు అద్భుతమైన అనుభవాన్ని పొందుతారని అన్నారు. ముఖ్యంగా సలార్, యానిమల్, కాంతార చిత్రాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ చేసిన సౌండ్ డిజైన్ విశేషమని తెలిపారు.
తాజాగా కొత్త తరహా పాత్రల్లో నటించాలని, నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పెరిగిందని బెల్లంకొండ చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘టైసన్ నాయుడు’ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగా, ‘హైందవ’ షూటింగ్ చివరి దశలో ఉందని, అలాగే ‘పొలిమేర’ దర్శకుడు అనిల్‌తో న్యూ ఏజ్ థ్రిల్లర్ కూడా చేయబోతున్నట్టు వెల్లడించారు.
‘కిష్కిందపురి’ మాత్రం ప్రేక్షకులకు ఒక కొత్త హారర్-మిస్టరీ అనుభూతిని ఇవ్వడం ఖాయం అంటున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
COMMENTS