Amaravati Development: Minister Narayana Answers MLAs in AP Assembly

అమరావతి పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ కీలక సమాధానాలు

Homeఆంధ్రప్రదేశ్

అమరావతి పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ కీలక సమాధానాలు

అమరావతి అభివృద్ధి పనులపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 97 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసు.. హైకోర్టు తీర్పు రిజర్వ్
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన….
వివేకా హత్యపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ టార్గెట్

అమరావతి అభివృద్ధి పనులపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 97 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రశ్నలు అడగగా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులపై కూడా సభలో చర్చ జరిగింది.

అమరావతి రాజధాని పరిధిలో మొత్తం 119 పనులను ప్రతిపాదించగా, 103 పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం 97 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్థల ద్వారా రూ.41,187.7 కోట్ల నిధులను సమీకరించగా, ఇప్పటివరకు రూ.12,737.13 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.

ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా కొనసాగుతోందని నారాయణ తెలిపారు. ఇప్పటివరకు 30,173 మంది రైతులకు 71,293 ప్లాట్లు అందించినట్లు చెప్పారు. రైతులకు కౌలు రూపంలో రూ.2,248.03 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.

అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ 29 గ్రామాల్లో రోడ్లు, కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంకటపాలెం, పెదపరిమి, తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. 29 గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారిని నియమించి పనులను పర్యవేక్షించాలని కోరారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 29 గ్రామాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. రైతులకు కౌలు గడువు, గత ప్రభుత్వ హయాంలో పెరిగిన నిర్మాణ వ్యయం వంటి అంశాలపై ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి నారాయణ సమాధానమిస్తూ 29 గ్రామాల్లో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల అంచనా రూపొందించినట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో కొన్ని పనులకు మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చిందని, ఈ నెల 27 తర్వాత పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదురైన సమస్యల కారణంగా 29 గ్రామాల్లో అభివృద్ధి ఆలస్యమైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రైతులకు మరో పదేళ్లపాటు కౌలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2014-19తో పోలిస్తే ప్రస్తుతం అమరావతి అభివృద్ధి వ్యయం సుమారు 25 శాతం పెరిగిందన్నారు. మంగళగిరి రోడ్డుకు అనుసంధానమయ్యే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయిందని, అది అందుబాటులోకి రావడంతో కరకట్ట రోడ్డును మరుసటి రోజు నుంచి నిలిపివేస్తామని మంత్రి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ మండలిలో డీఎస్సీపై రగడ.. వైసీపీపై అచ్చెన్న, మనోహర్ ఫైర్

శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం.. ఎగువ నుంచి నిలిచిన వరద ప్రవాహం

సింధూ జలాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వార్నింగ్.. భారత్‌కు రెడ్‌లైన్!  

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews 

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube