ఇక యాచకులు కాదని మిత్రదేశాల భావన: షరీఫ్……. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఇక యాచకులు కాదని మిత్రదేశాల భావన: షరీఫ్…….

Homeఅంతర్జాతీయం

ఇక యాచకులు కాదని మిత్రదేశాల భావన: షరీఫ్…….

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాల సాయం కోరుతున్న

పరీక్షలన్నీ రద్దంటూ నోటిఫికేషన్.. కొట్టిపారేసిన UGC!!
ప్రపంచం మంటల్లో..! 50 దేశాల్లో యుద్ధాలు, ఘర్షణలు – 130 కోట్ల మందికి ప్రభావం….
BREAKING: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు…..

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు.
గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాల సాయం కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) సుమారు రూ.8 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని విడుదల చేసింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చైనా, అజర్‌బైజాన్, సౌదీ అరేబియా, UAE, టర్కీ వంటి దేశాలతో తమ బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దేశాలు ఇకపై తమను ‘భిక్షపాత్ర’తో వచ్చినవారిగా చూడటం లేదని, వారు ఇప్పుడు పాక్‌ను వాణిజ్యం, పరిశోధన, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భాగస్వామిగా భావిస్తున్నారని వెల్లడించారు.
దీంతో పాటు భారతదేశం IMF రుణ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. “ఈ నిధులు సరిహద్దు ఉగ్రవాదానికి దోహదపడే ప్రమాదం ఉంది” అని భారత ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. 1958 తర్వాత ఇప్పటివరకు పాక్‌కు IMF మొత్తం 25 సార్లు రుణసాయం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
షెహబాజ్ తన ప్రసంగంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ప్రస్తావిస్తూ, దేశ ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిగా తానేనని చెప్పారు. దేశ భవితవ్యాన్ని గౌరవప్రదంగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై కూడా స్పందించిన షెహబాజ్, భారత బ్రహ్మోస్ క్షిపణి దాడులు పాక్ రక్షణ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. మే 9-10 రాత్రి భారత వైమానిక దళాలు రావల్పిండిలోని ఎయిర్‌పోర్ట్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని పేర్కొన్నారు.
ఆజర్‌బైజాన్ పర్యటనలో మాట్లాడుతూ, “మేము తెల్లవారుజామున స్పందించకముందే భారత్ మళ్లీ బ్రహ్మోస్ క్షిపణులతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది,” అని షెహబాజ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వల్ల జరిగిన నష్టాన్ని పాక్ ప్రధాని బహిరంగంగా అంగీకరించడం ఇదే రెండోసారి. గత నెలలోనూ ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలు భారత దాడుల్లో నాశనం అయ్యాయని చెప్పారు.

Arukaleoverseas consultancy -instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube