పార్లమెంట్‌లో శునకం వివాదం–రేణుకా చౌదరీ వ్యాఖ్యలపై దుమారం

పార్లమెంట్‌లో శునకం వివాదం–రేణుకా చౌదరీ వ్యాఖ్యలపై దుమారం

Homeజాతీయం

పార్లమెంట్‌లో శునకం వివాదం–రేణుకా చౌదరీ వ్యాఖ్యలపై దుమారం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేణుకా చౌదరీ శునకం ఘటన పెద్ద వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు, రాజకీయ వాదోపవాదాలు వేడెక్కుతున్నాయి. దే

టీడీపీకి షాక్.. 2 రాజ్యసభ సీట్లు మిత్రపక్షాలకే?
బిహార్ ఎన్నికల్లో తేజస్వి, తేజ్ ప్రతాప్ వెనుకంజ – తాజా ట్రెండ్స్.
సిద్దరామయ్య రాజీనామా ఆమోదం.. కేబినెట్ రద్దు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేణుకా చౌదరీ శునకం ఘటన పెద్ద వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు, రాజకీయ వాదోపవాదాలు వేడెక్కుతున్నాయి.

దేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అనుకోని సంఘటన ఒకటి రాజకీయ వేడిని పెంచింది. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కూడా చర్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే సమావేశాలు 15 రోజులకు మాత్రమే కుదించడంపై అపోసిషన్ పార్టీలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరీ పార్లమెంట్ ప్రాంగణానికి శునకాన్ని తీసుకురావడం పెద్ద వివాదంగా మారింది. రేణుకా చౌదరీ తన కారులో వెళ్తుండగా రోడ్డుపై ఒక చిన్న శునకం కనిపించడంతో అది వాహనాల కింద పడే ప్రమాదం ఉందని భావించి దాన్ని ఎత్తుకుని కారులో పెట్టుకుని వచ్చానని వెల్లడించారు. అయితే భద్రతా సిబ్బంది ఆమెను పార్లమెంట్ గేటులో ఆపడంతో ఈ ఘటన రచ్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో రేణుకా చౌదరీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ శునకం కరవదని, కరవడానికి మనుషులు పార్లమెంటులోపలే ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్య రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. రోడ్డు మీద కనబడిన ఒక నోరులేని జీవిని కాపాడితే పెద్ద సమస్యలా చూపుతున్నారంటే విచిత్రంగా ఉందని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్‌లో కుక్కలను తీసుకురావద్దని ఎలాంటి చట్టం లేదని, ఒక జీవాన్ని రక్షించడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యాఖ్యాతలు తప్పుపట్టడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. అయితే రేణుకా చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ ఆగ్రహానికి దారితీశాయి. ఆమె వ్యాఖ్యలు పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.

రేణుకా చౌదరీ ఇతర ఎంపీలను కుక్కలతో పోల్చారన్న ఆరోపణలు కూడా బీజేపీ నేతలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాల కోసం మాత్రమే ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు కీలక చర్చలకు వేదిక కావాల్సిన సమయంలో ఇలాంటి సంఘటనలు ప్రాధాన్యం సంపాదించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక చిన్న శునకాన్ని ప్రాణాపాయం నుండి కాపాడిన చర్యను రేణుకా చౌదరీ మానవత్వంగా సమర్థించుకుంటే, ఆ వ్యాఖ్యలను బీజేపీ తీవ్ర అవమానకరంగా అభివర్ణిస్తోంది. దీంతో ఈ ఘటన శీతాకాల సమావేశాల్లో కొత్త రాజకీయ వాదోపవాదాలకు కారణమైంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube