హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై బాంబు బెదిరింపులు.. హైఅలర్ట్‌!

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై బాంబు బెదిరింపులు.. హైఅలర్ట్‌!

Homeజాతీయంఅంతర్జాతీయం

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై బాంబు బెదిరింపులు.. హైఅలర్ట్‌!

ఎయిర్ పోర్ట్‌ పేల్చేస్తామంటూ బెదిరింపులు.. హైదరాబాద్‌లో హైఅలర్ట్.. పోలీసుల తనిఖీలు! దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో దేశవ్యాప్తంగా ప

ప్రధాని మోదీ ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ.
డీఎన్‌ఏ సరిపోలికతో షాక్! ఢిల్లీ బాంబు పేలుడు కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీయే అని నిర్ధారణ.
ఢిల్లీ పేలుడు ఘటనపై కేబినెట్ సమావేశం.. మోదీ నేతృత్వంలో!

ఎయిర్ పోర్ట్‌ పేల్చేస్తామంటూ బెదిరింపులు.. హైదరాబాద్‌లో హైఅలర్ట్.. పోలీసుల తనిఖీలు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు పెంచారు. తాజాగా దేశంలోని ఐదు ప్రధాన నగరాల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు అందాయి.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామని బెదిరింపు ఇమెయిల్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కార్యాలయానికి వచ్చింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. భాగ్యనగరంలో బస్ స్టాప్‌లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించింది.

ఇక ఎయిర్ ఇండియా ప్రతినిధులు కూడా తమ వారణాసి విమానానికి బెదిరింపు అందిందని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం బాంబు బెదిరింపు అంచనా కమిటీని అప్రమత్తం చేశామని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.

ఇటీవల గుజరాత్‌లో అరెస్టయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు హైదరాబాద్‌ డాక్టర్ మోహియుద్దీన్ సయ్యద్‌గా గుర్తించారు. ఆయన ఇంటినే ల్యాబ్‌గా మార్చి రైసిన్ అనే ప్రమాదకర విషపదార్థం తయారుచేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించి అన్ని భద్రతా వ్యవస్థలను సక్రియం చేశారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube