Chikiri Chikiri Song: పెద్ది లో చరణ్ మాస్ డ్యాన్స్ మతిపోగొట్టేసింది! Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఎనర్జీ, డ్యాన్స్ స్టైల్‌త
Chikiri Chikiri Song: పెద్ది లో చరణ్ మాస్ డ్యాన్స్ మతిపోగొట్టేసింది!
Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఎనర్జీ, డ్యాన్స్ స్టైల్‌తో మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
తాజాగా విడుదలైన ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొండల్లో మాస్ లుక్‌లో చరణ్ వేసిన హుక్ స్టెప్ అభిమానుల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
టాలీవుడ్‌లో హుక్ స్టెప్స్ అంటేనే చిరంజీవి గుర్తుకు వస్తారు. ‘హిట్లర్’ నుంచి ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వరకు ఆయన స్టెప్పులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. అదే బ్లడ్‌లో పుట్టిన చరణ్ ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని కొత్త లెవెల్‌కి తీసుకెళ్తున్నారు. ప్రతి సినిమాలో కొత్త ఎనర్జీ, స్పెషల్ స్టెప్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
‘చికిరి చికిరి’ సాంగ్‌లో చరణ్ సాధారణ షర్ట్‌లో హీరోయిన్‌ను “చికిరి” అని పిలుచుకుంటూ చేసిన సిగ్నేచర్ స్టెప్ మాస్ క్రేజ్ సృష్టిస్తోంది. నోట్లో బీడీతో, బ్యాట్ పట్టుకుని “ఆ చంద్రుల్లో ముక్క, జారిందే నీ నక్క… నా చికిరి చికిరి” అంటూ వేసిన స్టెప్పులు అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
ముందుగా విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ భూమిపై బ్యాట్‌తో కొట్టిన షాట్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు అదే ఫ్రేమ్ ఆధారంగా వచ్చిన హుక్ స్టెప్ వైరల్ అవుతోంది.
ఈ సాంగ్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది.
ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, మోహిత్ చౌహాన్ వాయిస్, బాలాజీ రాసిన లిరిక్స్ కలిసి ఒక మ్యూజికల్ ఫెస్టివల్‌లా అనిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌లో మాసీ లుక్‌తో ఆకట్టుకున్నారు.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో
శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యంతో, ఉత్తరాంధ్ర వాతావరణంలో సాగే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న సినిమా విడుదల కానుంది.
‘చికిరి చికిరి’ పాటతో చరణ్ మరోసారి మెగా ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!
#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS