కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు: అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన భారత వాయుసేన.

కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు: అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన భారత వాయుసేన.

Homeజాతీయం

కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు: అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన భారత వాయుసేన.

కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు… ప్రత్యేక వీడియోతో అమరవీరులకు వాయుసేన నివాళి దేశం గర్వించే రోజు ఇది…భారత భూభాగాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన వీర జ

చేవెళ్ల బస్సు ప్రమాదంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందన | టిప్పర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం.
పోస్టాఫీస్ టాక్స్ సేవింగ్ స్కీమ్స్: వడ్డీ రేట్లు, ప్రయోజనాలు పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో జయలలిత భవనం సీజ్.. GHMC చర్యలు

కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు… ప్రత్యేక వీడియోతో అమరవీరులకు వాయుసేన నివాళి

దేశం గర్వించే రోజు ఇది…
భారత భూభాగాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పించే రోజు ఇది…
జులై 26న భారత దేశం ‘కార్గిల్ విజయ్ దివస్’ను ఘనంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా కార్గిల్ విజయానికి నేటితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. 1999 మే నుండి జులై వరకు కార్గిల్ కొండల్లో జరిగిన యుద్ధంలో భారత సైనికులు చూపిన వీరత్వం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ‘ఆపరేషన్ విజయ్‌’ పేరుతో చేపట్టిన ప్రతీకార యుద్ధంలో శత్రుసేనలను తరిమికొట్టి, దేశ భూభాగాన్ని కాపాడిన భారత ఆర్మీకి నేడు దేశం మరొసారి నమస్కరిస్తోంది.

వాయుసేన ప్రత్యేక నివాళి వీడియో

కార్గిల్ యుద్ధానికి 26వ వార్షికోత్సవం సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అని పేర్కొంది. యుద్ధ సమయంలో తీసిన అరుదైన దృశ్యాలు, సైనికుల శౌర్యాన్ని ఈ వీడియోలో ప్రదర్శించారు.

పాక్ కుట్ర.. ఇండియా ప్రతీకారం

1999లో ముజాహిదీన్‌ల ముసుగులో పాకిస్తాన్ సైన్యం LOC దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి, ఖాళీగా ఉన్న కీలక స్థావరాల్లో పాగా వేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న భారత ఆర్మీ తక్షణమే ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించి, శత్రువులపై ఎదురుదాడికి దిగింది. తక్కువ కాలంలోనే భారత సైన్యం పాక్ సేనలను తరిమికొట్టి, జూలై 26న విజయాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివస్‌’గా గుర్తిస్తూ, దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

 నేతల నివాళులు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ, “దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మన సైనికులు తమ జీవితాలను అంకితం చేశారు” అని తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “కార్గిల్ యుద్ధంలో సైనికులు అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడారు. వారి త్యాగానికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని పేర్కొన్నారు.

లద్దాఖ్‌లో ర్యాలీ

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని లద్దాఖ్‌లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, సంజయ్ సేథ్ విద్యార్థులు, స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్ల స్మృతి స్థలాల వద్ద నివాళులర్పించారు.


మన కర్తవ్యం…

కార్గిల్ యుద్ధం నాటి వీర జవాన్ల త్యాగాన్ని మరిచిపోలేం. వారి స్ఫూర్తితో నేడు యువత ముందుకు సాగాలి. దేశభక్తి, నైతిక విలువలు, సైనికుల గౌరవం ప్రతీ భారతీయుడిలో నింపాలి.

కార్గిల్ అమరవీరుల త్యాగానికి శత శత వందనాలు.
జై హింద్!

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
▶️ YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube