రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అరెస్ట్ – భారీ ఉగ్ర కుట్ర దుమారం! అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు వెలుగులోకి రావడం తీవ్ర కలకల
రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అరెస్ట్ – భారీ ఉగ్ర కుట్ర దుమారం!
అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఇటీవల రెండు ప్రధానమైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దర్యాప్తులో వారు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇళ్లలో పేలుడు పదార్థాల కలకలం
రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో వీరి నివాసాల్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో బాంబుల తయారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడు వైర్లు వంటి అనేక ఉగ్ర సామగ్రి బయటపడింది. వారిద్దరూ గత దశాబ్దం నుంచి ఇక్కడే నివాసం ఉంటూ, స్థానిక పేద మహిళలతో వివాహం చేసుకొని సామాన్యుల్లా జీవించారన్నది పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
1995 నుంచి ఉగ్ర చరిత్ర
పట్టుబడిన ఈ ఇద్దరూ 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయం బాంబు దాడి, నాగూరులో పార్సిల్ బాంబు పేలుడు వంటి ఘటనలతో పాటు, 1999లో తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఏడు బాంబు పేలుళ్ల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. వీరిపై 2011 మధురైలో అద్వానీ రథయాత్రపై కుట్ర, 2012లో డాక్టర్ అరవింద రెడ్డి హత్య, 2013 బెంగళూరు BJP కార్యాలయం పేలుడు కేసులు నమోదయ్యాయి.
వారు ఎలా దొరికారు?
తాజాగా మొబైల్ ఫోన్ల డేటా ఆధారంగా వీరి కదలికలను గుర్తించిన తమిళనాడు ATS, ఏపీ పోలీసులతో కలిసి రాయచోటిలో ఉన్న వీరి ఇళ్లపై దాడులు నిర్వహించింది. ప్రస్తుతం వారి ఫోన్లలోని సమాచారం ఆధారంగా స్థానిక సహకారులు ఎవరు?, ఇంకా ఎవరెవరితో సంబంధం ఉంది? అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.
ప్రజలలో భయాందోళనలు
రాయచోటి ప్రజలు ఈ సంఘటనతో షాక్‌లోకెళ్లారు. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఇద్దరితో పాటు మరొక అనుమానితుడు కూడా రాయచోటిలోనే ఉంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS