అఖిల్ పెళ్లితో అక్కినేని ఇంట్లో ఘన వేడుకలు. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

అఖిల్ పెళ్లితో అక్కినేని ఇంట్లో ఘన వేడుకలు.

Homeసినిమా

అఖిల్ పెళ్లితో అక్కినేని ఇంట్లో ఘన వేడుకలు.

హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో ఈ రోజు పెళ్లి సందడి నెలకొంది. జూన్ 6న అంటే ఈ రోజే యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్‌ను వివాహం చేసుకుంటున్నారు

ఘాటీ మూవీ రివ్యూ | Anushka Shetty & Krish Combo Disappoints
‘గోదావరి’కి 19 ఏళ్లు!
‘OG’ షూటింగ్ కు పవన్!

హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో ఈ రోజు పెళ్లి సందడి నెలకొంది. జూన్ 6న అంటే ఈ రోజే యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్‌ను వివాహం చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి సంబరాలు గురువారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
నాగార్జున స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడులకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, హీరో శర్వానంద్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సహా పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. టాలీవుడ్ మొత్తం ఈ వేడుకలకు తరలివచ్చేలా ఉంది.
పెళ్లి తర్వాత, జూన్ 8న ప్రత్యేకంగా సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ సోదరుడు నాగ చైతన్య మరియు ఆయన ప్రేమికురాలు శోభిత ధూళిపాళా కూడా ఈ వేడుకల కోసం తమ వెకేషన్‌ను ముందుగానే ముగించుకుని హాజరయ్యారు. గతంలో చై-శోభిత పెళ్లిని చాలా లో ప్రొఫైల్‌లో నిర్వహించగా, అఖిల్ పెళ్లి మాత్రం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
వధువు జైనబ్ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారిగా తెలిసింది. స్వంతంగా కూడా వ్యాపారాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పెళ్లి తరువాత అఖిల్ తన కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.
క్రితం సినిమాల పరంగా అఖిల్‌కు ఆశించిన విజయాలు రాలేదు. ‘ఏజెంట్’ మూవీ తారక్ రేంజ్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అతను ‘లెనిన్’ అనే కొత్త చిత్రంతో తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. ఇది ఓ పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది.
అయితే శ్రీలీల కూడా వరుస ఫ్లాపులతో ముద్ర వేసుకుంటుండటంతో, అక్కినేని అభిమానుల్లో ఈ సినిమా ఫలితంపై భయం మొదలైంది. మరి పెళ్లి తర్వాత అయినా అఖిల్‌కు లక్ కలిసొస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube