“భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం”… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

“భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం”…

Homeజాతీయం

“భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం”…

భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం – బీహార్‌లో హైఅలర్ట్ పాట్నా, మే 27: భారత్-నేపాల్ సరిహద్దులో మరోసారి డ్రోన్ల చొరబాటుతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం

పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత….
పాక్‌కు మోదీ కఠిన హెచ్చరిక…
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ ఆపరేషన్: చందేల్‌లో 10 మిలిటెంట్లు మృతి..

భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం – బీహార్‌లో హైఅలర్ట్
పాట్నా, మే 27:
భారత్-నేపాల్ సరిహద్దులో మరోసారి డ్రోన్ల చొరబాటుతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి బీహార్‌లోని మధుబని జిల్లా కమ్లా బోర్డర్ ఔట్‌పోస్ట్ వద్ద 15-20 డ్రోన్లు భారత గగనతలంలోకి ప్రవేశించి 40 నిమిషాలపాటు చక్కర్లు కొట్టి నేపాల్ వైపు వెళ్లిపోయాయి.
ఈ ఘటనపై బీహార్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న సశస్త్ర సీమా బల్‌ (SSB) డిప్యూటీ కమాండెంట్ వివేక్ ఓజా, ఈ ఘటనపై దర్బాంగ, ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లకు సమాచారం పంపించారు.
నేపాల్ డ్రోన్ విన్యాసం కాదట!
భారత్ వైపు నుండి నేపాల్ అధికారులను ప్రశ్నించగా, “మేము ఎటువంటి డ్రోన్ విన్యాసాలు నిర్వహించలేదు” అంటూ అక్కడి అధికారులు సమాధానమిచ్చారు. దీంతో ఈ డ్రోన్ల ఉనికి వెనుక గల ఉద్దేశంపై అనుమానాలు ముమ్మరంగా ఉన్నాయి.
సరిహద్దు భద్రత కఠినతరం.
బీహార్‌ సరిహద్దు జిల్లాల్లో పోలీస్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. డ్రోన్లు సేకరించిన సమాచారం, దిశ, ప్రయోజనం వంటి అంశాలపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.

Nakashatra Agency – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube