Five main reasons behind Muhammad Yunus' resignation...

మహమ్మద్ యూనస్ రాజీనామా వెనుక ఐదు ముఖ్య కారణాలు….

Homeఅంతర్జాతీయం

మహమ్మద్ యూనస్ రాజీనామా వెనుక ఐదు ముఖ్య కారణాలు….

మహమ్మద్ యూనస్ రాజీనామాకు ఐదు ముఖ్య కారణాలు.. బంగ్లాదేశ్‌లో రాజకీయం ఊగిసలాటలోకి..! ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్

లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం – ప్రవాస భారతీయుల హర్షాతిరేకం.
రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు: బ్రెజిల్ మోడల్ లారిస్సా ఎవరు? భారత ఎన్నికల్లో ఫేక్ వోట్ల స్కాండల్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన ట్రంప్….

మహమ్మద్ యూనస్ రాజీనామాకు ఐదు ముఖ్య కారణాలు.. బంగ్లాదేశ్‌లో రాజకీయం ఊగిసలాటలోకి..!
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ యూనస్ త్వరలో రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ అధికారం ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ చేతుల్లోకి వెళ్తుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూనస్ రాజీనామాకు ఐదు కీలక కారణాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
1. రాజకీయ పార్టీలు సమగ్ర మద్దతు ఇవ్వకపోవడం:
యూనస్ సర్కారుకు బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీల మద్దతు లేకపోవడం అత్యంత కీలక అంశం. ముఖ్యంగా 2026లో ఎన్నికలు నిర్వహిస్తామన్న యూనస్ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
2. బీఎన్‌పీ, ఇతర గుంపుల వ్యతిరేక ఉద్యమం:
అవామీ లీగ్ నిషేధంతో బీఎన్‌పీ నాయకత్వంలోని శక్తులు ఎన్నికల డిమాండ్‌తో ఉద్యమం ముమ్మరం చేశాయి. మరోవైపు NCP, ఇస్లామిక్ గుంపులు సంస్కరణల తర్వాతే ఎన్నికలు అంటూ ఎదురుదాడి కొనసాగిస్తున్నాయి.
3. ఆర్మీ చీఫ్ డిసెంబర్ డెడ్‌లైన్:
ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ డిసెంబర్ 2025లోనే ఎన్నికలు నిర్వహించాలని ఖచ్చితమైన అల్టిమేటం ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లా, బాహ్య వివాదాలు ముదిరాయి.
4. రఖైన్ కారిడార్ వివాదం:
యూనస్ తీసుకున్న మయన్మార్‌ రఖైన్ కారిడార్ నిర్ణయాన్ని ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది దేశ సార్వభౌమత్వానికి ముప్పు అని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.
5. సైనిక వ్యవహారాల్లో జోక్యం:
ఆర్మీ వ్యవహారాల్లో యూనస్ జోక్యం కారణంగా జనరల్ జమాన్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ స్థిరత లేకపోవడంతో, ఆయన ఎన్నికలపై ఒత్తిడి పెంచారు.
ఈ పరిణామాలన్నీ కలిపి బంగ్లాదేశ్‌లో రాజకీయ భవితవ్యంపై ఆందోళనను కలిగిస్తున్నాయి. దేశానికి ముందున్న మార్గం ఏంటి అనేది ఇంకా స్పష్టంగా లేదు.

Arukaleoverseas consultancy – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube