ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మణిపూర్ చందేల్ జిల్లా, ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం పరిధిలో సాయుధ మిలిటెంట్ల కదలికలపై స్పష్టమైన నిఘా సమ
ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మణిపూర్ చందేల్ జిల్లా, ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం పరిధిలో సాయుధ మిలిటెంట్ల కదలికలపై స్పష్టమైన నిఘా సమాచారాన్ని ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలో అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 10 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుండగా, సైనికులు అనుమానిత క్యాడర్లపై తీవ్ర కాల్పులు జరిపారు.
అయితే ఈ దాడిలో మిలిటెంట్ల దగ్గర నుండి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో భద్రతా బలగాలకు గట్టి విజయం సాధించింది.
ప్రాంతంలో భద్రతా పరిస్థితులు నిలుపుకోవడానికి సైనికులు మరింత చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

COMMENTS