నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణల నేపథ్యంలో దక్షిణ డిస్కం ప్రత్యేక కమిటీలతో ఉద్యోగుల విద్య, జనన, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభించి
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణల నేపథ్యంలో దక్షిణ డిస్కం ప్రత్యేక కమిటీలతో ఉద్యోగుల విద్య, జనన, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభించింది.
నకిలీ సర్టిఫికెట్లతో విద్యుత్ శాఖలో కొందరు ఉద్యోగాలు పొందారనే ఆరోపణల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) కీలక చర్యలు చేపట్టింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హత, జనన, కుల ధ్రువీకరణ పత్రాలను మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి సర్కిల్ స్థాయిలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
ఈ కమిటీల్లో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) చైర్మన్‌గా ఉండగా, ఎస్‌ఏఓ, డీఈ (డీపీఈ), ఏపీటీఎస్పీ ప్రతినిధి, కార్పొరేట్ కార్యాలయం నుంచి అసిస్టెంట్ సెక్రటరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. సంస్థలోని అన్ని విభాగాల్లో ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికెట్లను సంబంధిత విద్యాసంస్థలు, అధికారిక రికార్డులతో సరిపోల్చి ధ్రువీకరించనున్నారు.
కొంతమంది ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు లేదా ఎక్కువకాలం ఉద్యోగంలో కొనసాగేందుకు జనన ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొందరు నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో జూనియర్ లైన్‌మెన్‌లుగా, డిప్లమా సర్టిఫికెట్లతో సబ్ ఇంజనీర్లుగా, మరికొందరు ఏఈలుగా పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక ఆర్టిజన్లు గ్రేడ్ పెంపు, ఉద్యోగులు అదనపు ఇంక్రిమెంట్లు పొందేందుకు సమర్పించిన ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలనూ పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. ఎక్కడైనా నకిలీ లేదా తప్పుడు సమాచారం సమర్పించినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దక్షిణ డిస్కం పరిధిలో గత 12 ఏళ్లలో జరిగిన కారుణ్య నియామకాలపై కూడా ప్రత్యేక పరిశీలన చేపట్టనున్నారు. ఆ నియామకాల కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించాలని నిర్ణయించారు. ఈ చర్యలతో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ప్రయోజనం పొందిన వారి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు.. పార్లమెంట్‌లో కేంద్రం కీలక అడుగు?
నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
రూ.2 వేలపైగా UPI చెల్లింపులకు ఛార్జీలు? కేంద్రం కొత్త ప్రతిపాదన!
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS