తేజశ్రీ పదో తరగతి విద్యార్థిని ప్రేమ తల్లిని హత్య చేయించింది

మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి చంపి వెళ్లు: పదో తరగతి విద్యార్థిని తల్లిని హత్య చేయించిందెందుకు?

Homeతెలంగాణ

మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి చంపి వెళ్లు: పదో తరగతి విద్యార్థిని తల్లిని హత్య చేయించిందెందుకు?

16 ఏళ్ల బాలిక తేజశ్రీ, తన తల్లిని హత్య చేయించేందుకు ప్రియుడితో ప్లాన్ వేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.. హైదరాబాద్‌: జీడిమెట్లలో చోటుచే

జైపూర్ ఘోర రోడ్డు ప్రమాదం – 10 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు.
హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గించేందుకు ORR చుట్టూ కొత్త బస్టాండ్లు
GHMCలో రూ.5కే టిఫిన్ – ఇందిరమ్మ క్యాంటీన్ పూర్తి మెనూ ఇదే!

16 ఏళ్ల బాలిక తేజశ్రీ, తన తల్లిని హత్య చేయించేందుకు ప్రియుడితో ప్లాన్ వేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది..

హైదరాబాద్‌: జీడిమెట్లలో చోటుచేసుకున్న తల్లి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పదో తరగతి చదువుతున్న 16ఏళ్ల తేజశ్రీ తన ప్రియుడు శివ (19)తో కలిసి కన్న తల్లిని హత్య చేయించిందన్న నిజాలు బయటపడగా, పోలీసులు చెప్పిన విషయాలు ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

శివ డీజే గ్రూపులో పనిచేస్తుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తేజశ్రీతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి మధ్య ఎనిమిది నెలలుగా ప్రేమ కొనసాగుతోంది. అయితే తేజశ్రీ తల్లి అంజలి ఈ వ్యవహారానికి గట్టి ఎదురు తిరిగి, శివతో సంబంధాన్ని ముగించమని తేజశ్రీని పదే పదే మందలించేది. కొన్నిసార్లు కొట్టిందని తేజశ్రీ తెలిపింది.

తల్లి అడ్డుపడుతున్నదన్న కోపంతో తేజశ్రీ, శివ మరియు అతని 16 ఏళ్ల తమ్ముడితో కలిసి తల్లిని చంపేందుకు ప్లాన్ వేసింది. ఇంట్లో తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో శివతోపాటు అతని తమ్ముడిని ఇంటికి రప్పించింది. అంజలి పూజలో ఉండగా చున్నీతో గొంతు బిగించి హత్యాయత్నం చేశారు. ఆమె చనిపోయిందని భావించి బయటకి వెళ్లిపోయారు.

అయితే కొద్దిసేపటికి తల్లి కాళ్లు, చేతులు కదలడంతో తేజశ్రీ తన ప్రియుడికి ఫోన్ చేసి “మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి పూర్తిగా చంపి వెళ్లు” అని చెప్పింది. వెంటనే తిరిగి వచ్చిన శివ, అతని తమ్ముడు అంజలిని మరణించేంతవరకూ గొంతు బిగించి చంపారు.

ఈ హత్యకు ప్రేరేపణ, ప్లానింగ్ అన్నీ తేజశ్రీనే చేసిందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. తల్లి ఎప్పుడూ తానుపై ప్రేమ చూపలేదని, కొట్టేదని, తిడేదని విచారణలో తేజశ్రీ తెలిపినట్లు చెప్పారు. నిందితుల వయస్సును పరిగణనలోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంజలి కుటుంబం మహబూబాబాద్ జిల్లా నివాసితులు కాగా, హైదరాబాద్‌లో 20 ఏళ్లుగా జీవిస్తున్నారు. ఆమె తెలంగాణ సాంస్కృతిక కళా మండలిలో పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఇంతటి తార్కికమైన, హృదయవిదారకమైన హత్యలో ఒక పదో తరగతి బాలిక ప్రధాన పాత్ర పోషించడాన్ని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. “కాలం మంచిగా లేదు” అంటూ తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు.

https://digitalprimenews.in/category/telangana/

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube