జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
నిరసనకారులు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించి, జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. వారు “పాకిస్తాన్ డౌన్ డౌన్” మరియు “భారత్ అమరవీరులకు జోహార్” వంటి నినాదాలు చేశారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని, దేశభక్తిని చాటారు.

COMMENTS