రవితేజ నో చెప్పిన మూడు బ్లాక్‌బస్టర్స్ – మహేష్ బాబు హిట్ ట్రాక్‌కి మలుపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలు ఏకంగా ఒక హీరో కోసం రాసినా, ఆ పాత్రలు చివరకు మ
రవితేజ నో చెప్పిన మూడు బ్లాక్‌బస్టర్స్ – మహేష్ బాబు హిట్ ట్రాక్‌కి మలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలు ఏకంగా ఒక హీరో కోసం రాసినా, ఆ పాత్రలు చివరకు మరొక హీరో చేతిలో పడితే హిట్ సినిమాలుగా మారిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అలాంటి ఘట్టాల పరంపరలో రవితేజ, మహేష్ బాబుతో కూడిన కథల మార్పులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

mahesh-babu
మాస్ మహారాజా రవితేజకు ముందుగా వినిపించిన మూడు కథలు చివరికి సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో భారీ విజయాలను సాధించాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి, శ్రీను వైట్ల తీసిన దూకుడు, కొరటాల శివ రాసిన శ్రీమంతుడు కథలు రవితేజ వద్దకు మొదటగా వెళ్లినవే. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా రవితేజ ఈ ప్రాజెక్టులకు నో చెప్పినట్లు సినీ వర్గాల్లో ప్రచారం.
ఈ చిత్రాలు మహేష్ బాబును ఒక స్టార్లో నుండి సూపర్‌స్టార్ స్థాయికి తీసుకెళ్లిన మైలురాళ్లుగా నిలిచాయి. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధించాయి.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు.

COMMENTS