పోచంపల్లిలో ఇక్కట్ ర్యాంప్ వాక్ ఆకర్షణ.యాదాద్రి జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన – భూదాన్ పోచంపల్లిలో ఇక్కట్ చీరలతో ర్యాంప్ వాక్ ప్రపంచ సుందరీమణులు
పోచంపల్లిలో ఇక్కట్ ర్యాంప్ వాక్ ఆకర్షణ.యాదాద్రి జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన – భూదాన్ పోచంపల్లిలో ఇక్కట్ చీరలతో ర్యాంప్ వాక్
ప్రపంచ సుందరీమణులు నేడు తెలంగాణలోని యాదాద్రి భూభాగాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేయనున్నారు. అనంతరం భూదాన్ పోచంపల్లికి వెళ్లి అక్కడి ప్రముఖ ఇక్కట్ వస్త్రాలతో నిర్వహించే ప్రత్యేక ఫొటోషూట్‌లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో సుందరీమణులు ఇక్కట్ చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయనుండటం విశేషం. తెలంగాణ చేనేత వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రజెంట్ చేయడంలో ఇది కీలక ఘట్టంగా మారనుంది.
విఐపీల పర్యటన నేపథ్యంలో యాదాద్రి మరియు పోచంపల్లిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యాటక అభివృద్ధి మరియు రాష్ట్ర సంప్రదాయ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా మారనుంది.

COMMENTS